WNP: చేయూత పింఛను పొందుతున్న లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని సర్పంచి గాయత్రి సూచించారు. కొత్తకోట మండలంలోని అమ్మడబాకులలో ప్రారంభమైన ఈ కేవైసీ కార్యక్రమానికి ఆమె హాజరై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. వివరాల్లో నమోదు చేసుకోకపోతే పించన్ పంపిణీలో ఇబ్బందులు ఏర్పడతాయని సూచించారు. పంచాయతీ కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు.