WGL: రాయపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని గుబ్బేడితండా ఓటర్లు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. 60 ఏళ్లుగా తాగునీరు, రోడ్లు, విద్యా, వైద్య సౌకర్యాలు లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 45 మంది ఓటర్లు ఏకగ్రీవంగా ఓటు వేయబోమని తీర్మానం చేశారు. మొదటి విడత పోలింగ్ ఈ నెల 11న జరగాల్సి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.