కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ రిజర్వాయర్లో గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో ప్రభుత్వం 100% సబ్సిడీపై ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారులకు స్థిరమైన ఉపాధి, భద్రమైన ఆదాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, చేపల ఉత్పత్తి పెరిగి వారికి మంచి లాభాలు దక్కుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.