NLG: నాయకులందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలన్నారు. చింతపల్లి మండలం, గడియ గౌరారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు.