MBNR: సరస్వతి నగర్లో త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం సరస్వతి నగర్ కాలనీ ప్లస్-3 ప్రాంతంలో అకస్మాత్తుగా వచ్చిన గాలి, వాన కారణంగా విద్యుత్ స్తంభం విరిగిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు.