PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామంలోని ZPHS స్కూల్ విద్యార్థులకు, గ్రామస్తుడైన పచ్చిక కేశవరెడ్డి సుమారు రూ. 25,000 విలువైన 360 టీ-షర్టులను విరాళంగా అందించారు. వాటిని డాపోశాల సదానందం గౌడ్, మాజీ ఎంపీటీసీ, విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పుల్లూరి సాగర్, HM మాధవి, టీచర్లు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.