ASF: అక్రమ ఆయుధాలతో హత్యాయత్నం చేసిన నిందితుడిని కౌటాల పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం SP నికిత పంత్ మాట్లాడుతూ.. బీహార్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి, వ్యాపారి హత్యకు ప్రయత్నం చేసిన కుర్బంకర్ అజయ్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కడన్నారు. నిందితుడి నుండి ఒక పిస్తోల్, ఒక తపాంచ, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం చేసుకున్నట్లు SP పేర్కొన్నారు.