ఖమ్మంలోని 20వ డివిజన్లో ఈస్ట్ జోనల్ కార్యాలయాన్ని మేయర్ పునుకొల్లు నీరజ సోమవారం ప్రారంభించారు. శుభ్రత, మౌలిక సదుపాయాలు వంటి ప్రజా వినతులను జోన్ స్థాయిలోనే త్వరితగతిన పూర్తిచేసే అవకాశం లభిస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యాలయం ద్వారా పౌరులకు మున్సిపల్ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయి.