HYD: సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల అధికారిక వెబ్సైట్లపై హ్యాకర్లు దాడి చేశారు. ఈ దాడుల కారణంగా, 10 రోజులుగా వెబ్సైట్లు సరిగా పని చేయడం లేదు. ఈ వెబ్సైట్లను ఓపెన్ చేస్తే, అధికారిక సమాచారంకు బదులుగా బెట్టింగ్ సైట్లకు దారి మళ్లిస్తున్నాయి. కాగా, ఇటీవల హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే.