SRD: జిల్లాలోని అన్ని రకాల జూనియర్ కళాశాలలకు రేపటి నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. సెలవుల అనంతరం తిరిగి 19న కళాశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని డీఐఈవో స్పష్టం చేశారు.