NGKL: వంగూరు ఎస్సై జి. మాధవరెడ్డి మండల యువతకు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సరదాగా మొదలైన అలవాటు వ్యసనంగా మారి కుటుంబాలను నాశనం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం చట్ట ప్రకారం తీవ్రమైన నేరమని, వీటిపై కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. యువత మంచి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.