GDWL: కేటి దొడ్డి మండలంలోని కోతులగిద్ద గ్రామంలో కల్వర్టు దెబ్బతినడంతో రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కల్వర్టు రోడ్డు దెబ్బతినడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి తగిన మరమ్మతు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.