MDK: కౌడిపల్లి మండలం తాళ్లగడ్డ తండాలో విషాదం నెలకొంది. జనవరి 1న తాళ్లగడ్డ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకృష్ణ, హైదరాబాద్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గత నాలుగేళ్లలోనే ఆ దంపతుల ఇద్దరు కుమారులు వేర్వేరు ప్రమాదాల్లో మరణించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.