SRPT: నడిగూడెం మండలం బృందావనపురంలో అంగన్వాడీ భవన నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించి, పూర్తి చేయాలని ఆర్డీవో సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామంలో వివాదాస్పదంగా మారిన నిర్మాణ స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతనంగా మంజూరైన ప్రభుత్వ భవనాన్ని రాజకీయాలకతీతంగా నిర్మించుకోవాలని సూచించారు.