అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, హెల్ప్ ఏజ్ ఇండియా హైదరాబాద్ నగరంలో #GenerationsTogether పేరిట ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ప్రజా ఆలోచనా వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వేపూరి గోపాలరావు, ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎస్ శ్రీధర్ ప్రసంగించారు. వృద్ధుల సంరక్షణకు సమాజం ఎలా సహకరించాలో వక్తలు పలు సూచనలు చేశారు.