SRPT: పాలకీడు మండల కేంద్రంలో ఈనెల 27 నుండి అక్టోబర్ 10 వరకు నిర్వహించే సీపీఎం గ్రామమహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి ప్రకాష్ పేర్కొన్నారు. సోమవారం సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు.