ఖమ్మం: మధిర మండలం జిలుగుమాడు గ్రామంలో గురువారం సీపీఎం గ్రామ శాఖ మహాసభ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని జిల్లా నాయకులు నరసింహారావు అన్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ నాయకులు పాల్గొన్నారు.