JGL: విధి నిర్వహణలో అంకిత భావంతో పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లాకు కేటాయించిన ఎస్సైలు బుధవారం జిల్లా ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు కేటాయించబడిన ట్రైనీ ఎస్సైలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణకు మారుపేరు పోలీసు డిపార్ట్మెంట్, అలాంటి శాఖలో నియమితులైన మీరు క్రమశిక్షణతో మెలగాలన్నారు.