ADB: బాలికలలో రక్తహీనత నివారణకు ఇప్ప పువ్వులడ్డు ఉపయోగపడుతుందని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఆదివారం ఉట్నూరు పట్టణంలోని కేబి కాంప్లెక్స్‌లో ఆశ్రమ పాఠశాలల బాలికలకు ఇప్పపువ్వుతో తయారుచేసిన లడ్డూలను పంపిణీ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు అధికారులు ఇప్పపువ్వు లడ్డులను అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.