ADB: రక్తహీనత నివారణకు పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలని జన్నారం ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ సూచించారు. బుధవారం మధ్యాహ్నం జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో కిశోర బాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షను నిర్వహించారు. అలాగే అంగన్వాడీ చిన్నారులకు ఎత్తు, బరువు కొలిచారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కమలాకర్ మాధవి ఉన్నారు.