నిజామాబాద్: ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పెంపుడు కుక్కలకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నట్లు జిల్లా పశువైద్యాధి కారి జగన్నాథచారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీ జిల్లా పశువై ద్యశాలతో పాటు మున్సిపల్ పరిధిలో ఏరియా వైద్యశాలలు, పశు వైద్యశాలలో టీకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.