NZB: నిజాంసాగర్ ప్రాజెక్టు గేటును మూసి వేయడం జరిగింది. మంగళవారం సాయంత్రం ఇన్ ఫ్లో తగ్గిపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లను మూసి వేయడం జరిగింది. ప్రస్తుతం 4200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని, ప్రధాన కాలువ 2 వేల క్యూసెక్కుల ఔట్ ప్లో కొనసాగుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1404.92 అడుగులు నీరు నిల్వ ఉందన్నారు.