KNR: మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత చేపల పంపిణీ కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు జరగకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు .వానాకాలం పూర్తి అవుతున్నప్పటికీ చేప పిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో అయోమయంలో పడ్డారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 13,456 హెక్టార్లలో 1,008 చెరువులు ఉన్నాయి.