MDK: నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఆయన అన్నారు.