ఖమ్మం: బయ్యారం మండలంలోని రామచంద్రపురంలో గల సింగారం, రామచంద్రపురం, చింతోని గుంపు గ్రామాలకు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఐమాక్స్, ఎస్ఈడీ లైట్స్ మంజూరు చేశారు. గ్రామంపై ప్రత్యేక చొరవ చూపించి ఎస్ఈడీ లైట్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లుకు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.