NRML: అభం శుభం తెలియని అనాధ బాలుడిని జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది సోమవారం చేరదీశారు. పట్టణంలోని లాంగ్డపూర్ గ్రామానికి చెందిన వేల్మల కుమార్ అతని మామతో భిక్షాటన చేస్తున్నాడు. సోన్ మండలం బొప్పారం గ్రామంలో 1098 చైల్డ్ లైన్ సిబ్బంది చేరదీసింది. వెంటనే అతనిని బైంసా పట్నంలోని వివేకానంద ఆవాసంలో ప్రవేశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.