బెంగళూరు వేదికగా జరగనున్న భారత్ – న్యూజిలాండ్ తొలి టెస్టుకు అంతరాయం కలిగింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం 9:30 గం.లకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, 9 గం.లకు టాస్ వేయాల్సి ఉంది. వర్షం పడుతుండటంతో టాస్ ఆలస్యం కానుంది. దీంతో మ్యాచ్ సమయాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది.