ఇటాలియన్ టెన్నిస్ క్రీడా ప్రపంచంలో విషాదం నెలకొంది. రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశాడు. అనారోగ్య కారణాలతో రోమ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని ఇటాలియన్ టెన్నిస్ పెడరేషన్ ధ్రువీకరించింది. 1933లో ట్యూనిస్లో ఆయన జన్మించాడు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా, తల్లి రష్యన్ జాతీయురాలు.