యాషెస్ మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో తొలి 2 టెస్టులు ఆడని హేజిల్‌వుడ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అటు ఇంగ్లండ్ జట్టు నుంచి కూడా మోకాలి గాయంతో మార్క్ వుడ్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో మాథ్యూ ఫిషర్ ఇంగ్లీష్ జట్టులో చేరాడు. మరోవైపు ఆసీస్ కెప్టెన్ కమిన్స్ మూడో టెస్టు నుంచి ఆడనున్నాడు.