ఆసియా టౌన్ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియ A, యూఏఈ A జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోతున్నాడు. కేవలం 36 బంతుల్లో 121 పరుగులతో UAE బౌలర్లను ఊచకోత కోశాడు. వైభవ్ దెబ్బకు భారత్ భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం భారత్ 11 ఓవర్లలో 179 పరుగులు చేయగా అందులో వైభవ్(131) రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు.