ఈ ఏడాది IPL మినీ వేలాన్ని అబుదాబిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వేలం డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో ఉంటుందని ఓ BCCI అధికారి చెప్పాడని కథనాలు వస్తున్నాయి. దీంతో విదేశాల్లో IPL వేలం నిర్వహించడం ఇది మూడోసారి కానుంది. 2023లో దుబాయ్, 2024 జెడ్డాలో వేలం వేశారు. కాగా ఫ్రాంచైజీలకు ప్లేయర్ల రిటెన్షన్ డెడ్లైన్ ఈ నెల 15తో ముగుస్తుందని సమాచారం.