దోహా వేదికగా జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ షూటర్ సురిచి సింగ్ గోల్డ్ మెడల్ సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆమె పతకం సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్లో సంయమ్ సింగ్ కూడా రజతం గెలుచుకుంది. అయితే, ఒలింపిక్ పతక విజేత మను బాకర్(6వ స్థానం) నిరాశపరిచింది. కాగా, పురుషుల విభాగంలో సమ్రాట్ కాంస్యం గెలుచుకున్నాడు.