యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టును వరుస గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే తొలి టెస్టు కోసం కెప్టెన్ కమిన్స్ సేవలను కోల్పోయిన ఆసీస్‌కు.. ఇప్పుడు మరో ఇద్దరు కీలక ప్లేయర్లు దూరం కానున్నట్లు సమాచారం. విక్టోరియాతో జరుగుతున్న మ్యాచ్‌లో జోష్ హేజిల్‌వుడ్, సీన్ అబాట్ గాయపడ్డారు. దీంతో వాళ్లిద్దరూ ఆడటం అనుమానంగా మారింది.