సంజూ శాంసన్‌పై ట్రేడ్ డీల్ వార్తల నేపథ్యంలో మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ గౌక్వాడ్/ ఉర్విల్ పటేల్‌తో కలిసి సంజూ శాంసన్ CSK ఓపెనర్‌గా ఆడితే చూడాలనుందన్నాడు. టీమిండియా ఓపెనర్ స్థానం కోసమైనా శాంసన్ ఇలా చేయాలన్నాడు. కాగా శాంసన్ కోసం CSK.. RRకి జడేజా, సామ్ కరన్‌ని అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.