టీమిండియా, సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో తొలి రోజు ఆట ముగిసింది. భారత్ 20 ఓవర్లలో 37 పరుగులు చేసింది. జైస్వాల్(12) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్(13*), వాషింగ్టన్ సుందర్ (6*) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 1 వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్సింగ్‌లో సౌతాఫ్రికా 55 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.