ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. బీసీసీఐ చెప్పినట్లు పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్లేది లేదని స్పష్టం చేసింది. దీంతో హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని ఐసీసీ చూస్తోంది. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు.