సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్ అవ్వడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘నేనే కోచ్‌గా ఉంటే ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహించేవాడిని’ అని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రస్తుత కోచ్ గంభీర్‌ను తాను అస్సలు వెనకేసుకురానని స్పష్టం చేశారు. జట్టు ఓడినప్పుడు కోచ్‌గా బాధ్యత స్వీకరించాల్సిందేనని గంభీర్‌కు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు.