AFG క్రికెటర్ రషీద్ ఖాన్ 2వ పెళ్లి చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల రషీద్ ఓ అమ్మాయితో ఉన్న ఫొటోలు వైరల్ కాగా.. ‘ఈ ఏడాది ఆగస్టు 2న నిఖా చేసుకున్నా. ఫొటోల్లో నా ఉన్నది నా భార్యే’ అని రషీద్ తెలిపారు. అయితే గతంలోనే అతనికి పెళ్లి అయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఫొటోల్లో ఉన్న ఆమె రెండో భార్యనా లేక తొలి భార్యనా అనేది తెలియాల్సి ఉంది.