తొలి టెస్టులో బుమ్రా బౌలింగ్ ధాటికి సౌతాఫ్రికా ఓపెనర్లు పెవిలియన్ చేరారు. మార్క్రమ్తో కలిసి SAకు శుభారంభం ఇవ్వాలనుకుంటున్న రికెల్టన్(23)ని 11వ ఓవర్లో బుమ్రా బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే 13వ ఓవర్లో మార్క్రమ్(31)నీ ఔట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా 62 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం వియాన్ ముల్డర్(0), టెంబా బవుమా(0) క్రీజులు ఉన్నారు.