తొలి టెస్టులో సౌతాఫ్రికా తమ సీనియర్ బౌలర్ కగిసో రబాడా లేకుండానే బరిలోకి దిగింది. బలమైన టీమిండియాతో వారి మైదానంలోనే ఆడుతున్న సౌతాఫ్రికా రబాడాను పక్కనపెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే రబాడా పక్కటెముకల గాయంతో బాధపడుతున్నందునే.. అతనికి బదులు కార్బిన్ బాష్ని తీసుకున్నట్లు బవుమా తెలిపాడు. కాగా 2 టెస్టుల ఈ సిరీస్లో SA వ్యూహాలకు రబాడా కీలకం.