అక్టోబర్ నెలకు గాను ICC ప్రకటించిన ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుల్లో స్మృతి మంధానకు నిరాశే ఎదురైంది. మహిళా క్రికెటర్ల విభాగంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అవార్డును దక్కించుకుంది. ప్రపంచకప్ టోర్నీలో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసినందుకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది . అలాగే, పురుషుల విభాగంలో దక్షిణాఫ్రికా బౌలర్ సీనురన్ ముత్తుసామి అవార్డును సొంతం చేసుకున్నాడు.