టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు నమోదయింది. ఒకే మ్యాచ్‌లో 11 మంది ప్లేయర్లు బౌలింగ్ వేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ 11 మందితో బౌలింగ్ వేయించాడు. ఆయుష్ కూడా 1 వికెట్ తీశాడు. ఇలా ప్లేయర్లు అందరూ బౌలింగ్ వేయడం ఇది తొలిసారి కాగా ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గతంలో IPLలో దక్కన్ ఛార్జర్స్,RCB 9 మంది బౌలర్లను వినియోగించుకుంది.