RRతో మ్యాచ్ నేపథ్యంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 29 లక్షల మంది ప్రజలకు సహాయం అందించి వారి జీవితాల్లో మార్పు తెచ్చారు. ఇందులో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. ప్రతి ఏడాది ఆ ఫౌండేషన్ కోసం ఒక మ్యాచ్ ఆడుతాం. మేం కేవలం ఆ పిల్లల కోసం మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం’ అని అన్నాడు.