బీసీసీఐపై శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫైర్ అయ్యారు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీకి BCCI అనుమతించడాన్ని ఆమె తప్పుపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో ఎలాంటి సంబంధాలు ఉండవని కేంద్రం చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. పహల్గామ్లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోక ముందే పాక్తో మ్యాచ్లు ఆడటం సరికాదని వ్యాఖ్యానించారు.