కోల్కతా టెస్టులో సౌతాఫ్రికా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 105 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజులో టోనీ డి జోర్జి (15), వియాన్ ముల్డర్(22) ఉన్నారు. అంతకుముందు రికెల్టన్(6), మార్క్రమ్(31), బవుమా(3) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో బుమ్రా 2, కుల్దీప్ ఓ వికెట్ తీశారు.