మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో బీహార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 60 బంతుల్లోనే 107* పరుగులు చేసి సెంచరీతో కదం తొక్కాడు. వైభవ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. 178 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆయుష్ లోహరుకాతో కలిసి కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పి బీహార్‌కు భారీ స్కోరు అందించాడు.