టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ పునరాగమనానికి సిద్ధమయ్యాడు. గాయం కారణంగా ఏడాదిగా క్రికెట్‌కు దూరమై జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. తాజాగా షమీ ఫిట్నెస్ సాధించాడని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో జరగబోయే మ్యాచ్‌లో షమీ బెంగాల్ తరపున బరిలోకి దిగనున్నాడని పేర్కొంది. కాగా ఈ మ్యాచ్ నవంబర్ 13న ప్రారంభం కానుంది.