భారత్, సౌతాఫ్రికా మధ్య రేపు జరగనున్న రెండో వన్డే సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ టీమిండియా తరఫున T20 ప్రపంచకప్ ఆడుతున్న సమయంలో తాను ఇంకా బడిలో చదువుకుంటున్నట్లు బవుమా తెలిపాడు. రోహిత్, కోహ్లీలకు క్రికెట్లో అపారమైన అనుభవం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరు దిగ్గజాల వల్ల ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారుతుందని పేర్కొన్నాడు.