IPL-2026లో భాగంగా ఇవాళ్టి చివరి లీగ్ మ్యాచ్‌కు ముందు ముంబై జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. గాయపడిన క్వింటన్ డికాక్, రాజ్ అంగద్ బవాల స్థానంలో మహిపాల్ లోమ్రార్, రుచిత్ అహిర్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్లో దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో వెనుకబడిన ముంబై, చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించి గెలుపుతో టోర్నీని ముగించాలని చూస్తోంది.