వచ్చే IPL సీజన్ నాటికి చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచులు ఆడేలా చూస్తామని మాజీ క్రికెటర్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(KSCA) అధ్యక్ష అభ్యర్థి వెంకటేష్ ప్రసాద్ తెలిపాడు. అలాగే రాష్ట్ర డొమెస్టిక్ క్రికెట్‌కి, చిన్నస్వామికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నాడు. ఇలాంటి లక్ష్యాలతోనే KSCA అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టంచేశాడు.